ఖర్జురాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..

0
150

ఖర్జురా శరీరానికి ఎంతో మంచిది. ఇది తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నవారిని ఇవి తీసుకోమని వైద్యులు సూచిస్తారు. అంతేకాకుండా ఎనర్జీ లెవెల్స్ ను పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో  కూడా ఇది తోడ్పడుతుంది. ఇన్ని లాభాలు ఉన్న ఖర్జురా నిల్వచేయడం ఎలానో తెలుకోవాలిగా మరి..

ఖర్జూరం ఎక్కువగా తీసుకున్నప్పుడు గింజ తీసేసి స్టోర్ చేసుకోవాలి. లేదంటే పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఖర్జూరాలను ఎల్లప్పుడూ శుభ్రమైన గాజు పాత్రలో నిల్వ ఉండేలా చుడండి. జార్ ను ఎప్పుడూ ఖర్జూరంతో పూర్తిగా నింపకండి. ఇలా చేయడం వల్ల అది త్వరగా పాడైపోతుంది. సూర్యకాంతి, వేడి,గాలి, గ్యాస్ తగలకుండా చూసుకోవాలి.

ఖర్జూరాలను సుమారు 6 నెలల పాటు నిల్వ చేయడానికి, దానిని ఒక జార్‌లో నింపి, బ్లాటింగ్ పేపర్‌తో మూసి ఉంచండి, మీరు కావాలంటే ఖర్జూరాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని ప్లాస్టిక్ కంటైనర్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇది మాములుగా కంటే పాలల్లో నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన లాభాలు పొందవచ్చు.