ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ సోకిన తర్వాత కోలుకున్న వారిలో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. మరికొందరు షుగర్ లెవల్స్ పెరిగి ఇబ్బంది పడుతున్నారు. అప్పటి వరకూ షుగర్ సమస్యలేని వారు షుగర్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా మరో సమస్య ఇప్పుడు కరోనా తగ్గిన తర్వాత కూడా బాధితులని వేధిస్తోంది.
హెర్పిస్ ఇన్ఫెక్షన్ చాలా మందిని వేధిస్తోందట. వైద్యులు తాజాగా గుర్తించారు. వైరస్ నుంచి కోలుకున్నాక ఇది తిరగబెడుతోంది. వీరిలో ముఖ్యంగా జట్టు రాలిపోవడం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, పెదవి చుట్టూ పొక్కులు, నీటి పొక్కులు ఇలాంటివి ఏర్పడుతున్నాయి.
దీనిని అశ్రద్ద చేయద్దు అంటున్నారు వైద్యులు. కొందరిలో వారిసెల్లా-జోస్టర్ వైరస్ మళ్లీ యాక్టివేట్ అయి హెర్పిస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. మర్మావయాల దగ్గర తెల్లటి పొక్కులు వస్తుంటాయి. గోళ్లు పాచిపోయిన రంగు గోధుమరంగులో మారితే వెంటనే వైద్యులని కలవాలని నిపుణులు తెలియచేస్తున్నారు. అయితే ఈ కేసులు అతి తక్కువే ఉన్నాయి, కాని అశ్రద్ద చేయద్దు అని నిపుణులు చెబుతున్నారు.