చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.. ఈ సమస్య పోవడానికి ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు, అయితే కొందరు మాత్రం చాలా లేట్ గా ఈ విషయం తెలుసుకుంటారు, అయితే ప్రాధమికంగా ఈ సమస్యని గుర్తిస్తే వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది అంటున్నారు వైద్యులు, మరి అసలు కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అని మనకు ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
బొడ్డు ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తుంటే, మూత్రపిండాలలో రాళ్లను తనిఖీ చేయండి. ఇక మీకు మూత్రం వచ్చిన సమయంలో నొప్పి వస్తుంది మంట ఎక్కువగా ఉంటుంది.. ఇలాంటి సమస్య వస్తే మీకు ఇబ్బంది అని గుర్తించాలి, ఇక మూత్రం ఎర్రగా రక్తంతో వస్తున్నా ఈ సమస్య ఉంది అని గుర్తించాలి.
ఇక మూత్రం పోసే సమయంలో నొప్పి ఇబ్బంది వస్తుంది ఇది కూడా ప్రాధమిక సమస్య అని గుర్తించాలి, ఇక ప్రతీ గంట అరగంటకు మూత్రం వస్తూ ఉంటే ఇలా మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతంగా ఉంటుంది. ఇక మూత్రం వాసన వస్తూ ఉంటుంది ఇది కూడా మరో లక్షణం. ఒకేసారి వాంతులు చలి జ్వరం ఇలాంటి సమస్యలు వస్తే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడుతున్నట్లు సూచన.