Home remedy to relieve migraine headache: ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వేధిస్తోంది మైగ్రేన్ తలనొప్పి. ఈ మైగ్రేన్ తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఈ తలనొప్పి మొదలైందంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి టాబ్లెట్ వేసుకున్నా వెంటనే ఉపశమనం ఉండదు. ఈ మైగ్రేన్ తలనొప్పి నుండి ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. వెల్లుల్లిపాయలు నూరి నుదుటిపై పట్టు వేసుకోవాలి. ఇలా చేయడం వలన మైగ్రేన్ తలనొప్పి, వాత సంబంధమైన తలనొప్పులు తగ్గిపోతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అయితే వెల్లుల్లి రసం కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి.
మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుందా.. ఈ వెల్లులి చిట్కాతో ఇట్టే కంట్రోల్ అవుతుంది!
-