పులిపిర్లు ఎందుకొస్తాయి? నివారణ ఎలా?

0
113

పులిపిర్లు ఒక విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వలన వస్తాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతివారిలోనూ వస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనై రోగనిరోధక శక్తి లోపించినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పులిపిర్లు వస్తాయి. సాధారణంగా పులిపిర్లతో ఏ సమస్య ఉండదు కాని కొన్నిసార్లు నొప్పి, దురద, రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉండవచ్చు. మరి పులిపిర్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి…

తరచూ మంచి నీళ్ల ఆవిరి పడితే శరీరానికి చెమటపడుతుంది. దీనివల్ల ముక్కు, ముఖంలోని కఫం కరిగి సమస్య తగ్గుతుంది. ఒక చెంచా చొప్పున అల్లం, బెల్లం కలిపి మెత్తగా నూరి రసం తీసి రాత్రి పడుకునే ముందు ఐదారు చుక్కలు ముక్కులో వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు చెంచా నీళ్లలో త్రిఫలాచూర్ణం కలిపి తీసుకోవచ్చు.

ముల్లంగి గింజల రసం తీసుకొని మూడు నుంచి ఆరు చుక్కలు ముక్కలో వేస్తే త్వరగా గుణం ఉంటుంది. దీనితోపాటు క్యారెట్ రసం రోజుకు రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి.

చిన్న పులిపిర్లు ఉన్నవారు అల్లం, నీరు, సున్నం సమానంగా కలిపి మెత్తగా పేస్ట్ చేసి వాటిమీద రాస్తే అవి అరిగిపోతాయి.

రావి పట్టును కాల్చి మసి చేసి దానికి కొత్త సున్న కలిపి వాటిమీద లేపనంగా రాస్తే కరిగిపోయే అవకాశం ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచే క్యారెట్, నారింజ, బీట్ రూట్, ద్రాక్ష, యాపిల్, ఉసిరి వంటివి తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోదక శక్తి పెరిగి ఇలాంటివి రాకుండా చేస్తుంది.

కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోతాయి.