చూడటానికి గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు. అందులో నల్లటి విత్తనాలు. చెప్పాలంటే సబ్జాగింజల్లా ఉంటాయి. ఇక ఈ ఫ్రూట్స్ ఇమ్యునిటీ పవర్ కోసం తెగ తీసుకుంటున్నారు. మన తెలుగు స్టేట్స్ లో కూడా ఇవి విరివిగా దొరుకుతున్నాయి. అయితే డ్రాగన్ అనగానే చైనా గుర్తు వస్తుంది. అందుకే ఇది చైనా నుంచి వచ్చిన ఫ్రూట్ అని చాలా మంది అనుకుంటారు.
వాస్తవానికి డ్రాగన్ ఫ్రూట్ అనే పేరే చిత్రంగా ఉంటుంది. దీనిని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ శత్రువుల్ని చంపుతుంది. ఇది చైనాలో ప్రజలు నమ్ముతారు. వీటి రూపు రేకల కారణంగా ఈ పండుకి ఆ పేరు పెట్టారు.
ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయ్లాండ్, వియత్నాం ప్రజలకు ఇవి చాలా ఇష్టం. ఇప్పుడు ఇండియాలో కూడా వీటిని బాగా ఇష్టంగా తింటున్నారు. ఈ ఫ్రూట్ తింటే నిగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇది షుగర్ ఉన్న వారు కూడా మితంగా తీసుకోవచ్చు.