మన ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని వైద్య నిపుణులు చెప్తారు. భారతీయ వంటల్లో అల్లం(Ginger) చాలా కీలకంగా ఉంటుంది. మన పెద్దలు దేన్నికూడా ఆలోచించకుండా మన వంటల్లో చేర్చలేదనేది కొందరి వాదన. మరి అల్లంతో అంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అంటే తప్పకుండా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి రోజూ అల్లం తింటే అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అవేంటో తెలిస్తే పచ్చి అల్లం కూడా ఆరగించేస్తారని అంటున్నారు. మరి అంతటి అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు అల్లంతో ఏం కలుగుతాయో తెలుసుకుందామా..
అల్లాన్ని మన రోజువారీ ఆహారం చేర్చుకోవడం వల్ల మన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అల్లం(Ginger)లో ఉండే ఎంజైమ్‌లు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకాన్ని వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్.. ఆర్థరైటిస్, కీళ్ల నొప్్పులు, ఇతర తాపజనక పరిస్థితుల లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఇది చాలా ప్రయోజనం కలిగిస్తోంది. మన రోగనిరోధక శక్తిని కూడా అద్భుతంగా పెంచుతుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలకు అల్లం అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. మన గుండెను పదిలంగా ఉంచడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది. అల్లం రోజూ వినియోగించడం వల్ల శరీరంలోని కొవ్వు స్థాయిలు గత్తుతాయి. మన రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నివారిస్తుంది. మెదడును చురుక్కా చేస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది. మరెన్నో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. వీటితో పాటుగా మరెన్నో ప్రయోజనాలు అల్లంతో కలుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.