ఈ రోజుల్లో డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం అనేది గుర్తు పెట్టుకోవాలి …డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో చాలా మంది ఆరోగ్యం పక్కన పెడుతున్నారు.. ఆ అశ్రద్ద చివరకు మిమ్మల్ని అనారోగ్యాల పాలు చేస్తోంది ..అనేక వ్యాధులకి కారణం అవుతోంది.. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి, ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తోంది.
మన శరీరంలో జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. మరి అసలు ఎలా మనం కిడ్నీ వ్యాధి వచ్చింది అనేది గుర్తించాలి.. అసలు సమస్య మనకు ఎలా తెలుస్తుంది అంటే.. వైద్యులు చెప్పేదాని ప్రకారం. కాళ్లు చేతులు వాపులు ఉంటాయి, అలాగే మీకు కిడ్నీ లు చెడిపోతే రుచి తెలియదు, మీకు ఏం తిన్నా వాంతులు అవుతాయి అసలు అన్నం సహించదు రుచి తెలియదు.
అలసట, మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు కిడ్నీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ భాగంలో నొప్పులు వస్తాయి…వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక మూత్రం కూడా రాకుండా ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ కిడ్నీ వ్యాధులు వచ్చినట్లు సంకేతాలుగా చెబుతారు.