బంగారు వ‌స్తువుల‌పై క‌రోనా వైర‌స్ ఎంత సేపు ఉంటుంది ? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

How long does the corona virus last on gold objects?

0
110

ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఏం ముట్టుకోవాలి అన్నా జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. ఎక్క‌డ ఏం ట‌చ్ చేస్తే ఏ వైర‌స్ వ‌స్తుందా అనే భ‌యం చాలా మందిలో ఉంటోంది. వివిధ రకాల ఉపరితలాలపై ఎక్కువ సమయం వైర‌స్ జీవించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వైర‌స్ ఎక్కువ‌గా కార్డుబోర్డు, స్టెయిన్‌లెస్ స్టీలు, ఇతర మెటల్ పై ఎక్కువ రోజులు ఉంటుంది అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇప్పుడు మ‌హిళ‌లు చాలా మంది బంగారు న‌గ‌లు వేసుకునేందుకు కూడా ఆలోచ‌న చేస్తున్నారు.
ఆ నగలపై కరోనా ఎంతసేపు ఉంటుంది అనే డౌట్ వచ్చింది. ఒక‌వేళ క‌రోనా వైర‌స్ బంగారు న‌గ‌ల‌పై ఉంటే? అది చేతుల‌కి తాకితే ? మ‌న ముక్కుకి, క‌ళ్ల‌కి, నోటికి తాకితే ఇక వైర‌స్ శ‌రీరంలోకి వెళ్లిన‌ట్టే, అందుకే కొంద‌రు దీని గురించి ఆలోచిస్తున్నారు.

అయితే చాలా మంది బంగారు వ‌స్తువులు తీసేసి చేతులు క‌డుగుతారు. దీని వ‌ల్ల‌ ఆ వైర‌స్ వ‌స్తువుల‌పైనే ఉంటుంది, మీరు బంగారు వ‌స్తువులు ధ‌రిస్తే క‌చ్చితంగా తీసే ముందు .జ్యువెలరీ క్లీన్సర్లతో క్లీన్ చేయండి. మ‌న‌కు మార్కెట్లో ఇవి దొరుకుతాయి. ఇక చేతుల‌కి రాసే శానిటైజ‌ర్ బంగారు న‌గ‌ల‌పై రాయ‌వ‌ద్దు. న‌గ‌లు క్వాలిటీ దెబ్బ‌తింటాయి. న‌లుపు రంగు వ‌స్తాయి.మెరుపును దెబ్బతీస్తాయి. దాదాపు రెండు రోజుల వ‌ర‌కూ ఈ వైర‌స్ బంగారు న‌గ‌ల‌పై ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.