లవంగం నూనె వల్ల శరీరానికి ఎన్ని లాభాలో మీకు తెలుసా ?

How many benefits to the body with clove oil

0
117

 

లవంగం ఓ మసాల దినుసు. కూరల్లో అది ఎంత రుచి ఇస్తుందో తెలిసిందే. ఇక ఉదయం వాడే పేస్ట్ నుంచి, వంటల్లో అనేక చోట్ల ఈ లవంగం మనకు కనిపిస్తూనే ఉంటుంది. మన దేశంలో కేరళ లవంగాలు ఎంతో ప్రత్యేకమైనవి. మంచి వాసన వస్తాయి, కూరలకు ఘాటుని తీసుకువస్తాయి. అంతేకాదు ఆయుర్వేద ప్రముఖులు దీనిని ఔషధాలలో వాడుతున్నారు.

బిర్యానీ, చికెన్ ,మటన్ ఇలాంటి ఏ కర్రీకి అయినా ఈ లవంగం ఎంతో రుచి తీసుకువస్తుంది. లవంగాల్లో విటమిన్ C, K, ఫైబర్ మాంగనీస్, ఉంటాయి. అయితే లవంగం నూనె కూడా ఉంటుంది. మనలో చాలా మంది పంటినొప్పి అనగానే ఈ లవంగం నూనె ఓ డ్రాప్ పంటిపై వేసుకుంటారు. ఆ నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది.

ఇది యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దగ్గు మందులో కూడా దీనిని వాడతారు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తనాళాలను ఎక్కువగా తెరుచుకునేట్లుగా చేస్తుంది. ఈ నూనె పంటి నొప్పి వస్తే చిగుళ్ల నొప్పిని తగ్గిస్తుంది. అనేక మందుల్లో దీనిని వాడతారు.