Carona news: తగ్గని కరోనా రక్కసి..ఒక్కరోజే ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

0
127

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ రక్కసి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు చేస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ  కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు 6,093 మందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. రికవరీ రేటు 98.7 శాతంగా నమోదు అయింది. మరో 6,768 మంది ఈ  మహమ్మారిని జయించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.11గా ఉంది.

కరోనా మహమ్మారి నుండి కాపాడుకోడానికి ఉన్న అస్త్రాలు ఒకటి వ్యాక్సిన్ కాగా మరొకటి మాస్క్. టీకా వైరస్ ను తట్టుకునే శక్తిని ఇవ్వగా మాస్క్ వైరస్ సోకకుండా కాపాడుతుంది. అయితే వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.