వేసవిలో ఎన్ని లీటర్ల నీరు తాగాలంటే?

0
96

ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండనుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మామూలు రోజుల్లోనే శరీరానికి తగినంత నీరు అందించాల్సిన అవసరం ఉంది. ఎండలు ముదరడంతో శరీరానికి కావల్సినంత నీరు అందించకపోవటం వల్ల అనేక ఆరోగ్య ససమ్యలను కొని తెచ్చుకుంటున్నారు.

రోజుకు ఎంతనీటిని తాగాలన్న ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. అలాగే దాహం వేస్తున్న సమయంలో తాగాలి. చెమట ఎక్కువగా పట్టిన సందర్భంలో నీటిని తాగటం మంచిది. దీని వల్ల హైడ్రేట్ గా ఉండవచ్చు. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం మహిళలు ప్రతిరోజూ 2.7 లీటర్లు. పురుషులు 3.7 లీటర్లు తాగాలని సూచిస్తున్నారు.

రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుందని, దాహం వేసినా, వేయకపోయినా.. గంట గంటకు నీళ్లు తాగాలని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ వుమన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వుమన్స్ అయితే.. కనీసం 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే వేసవి సమయంలో చెమట ఎక్కవగా పడుతుంది. కాబట్టి రోజుకు 4 లీటర్ల వరకు నీరు త్రాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.