వివాహం అయిన తర్వాత చాలా మంది పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు, అయితే కొందరికి వెంటనే గర్భం వస్తే మరికొందరికి సమయం పడుతుంది.. అయితే అన్నీ సాధారణంగా ఉంటే అమ్మాయి అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే వెంటనే గర్భవం వస్తుంది.. ఒకవేళ ఎవరిలో అయినా లోపం ఉంటే వారికి కాస్త సమయం పడుతుంది.
మీకు వివాహం అయి సంవత్సరం అయిందా, అయినా పిల్లలు లేరు అంటే మీరు అశ్రద్ద చేయకండి.. వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. ఈ సమయంలో ఇద్దరికీ టెస్టులు చేస్తారు. పురుషుడికి సంబంధించి స్మెర్మ్ కౌంట్ టెస్ట్ చేస్తారు.. మరి ఇందులో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ కచ్చితంగా చెక్ చేయించుకోవాలి.
మీకు సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల నుంచి 200 మిలియన్ల వరకు వీర్య కణాలు ఉండాలి. ఇంత కౌంట్ లేకపోతే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు.. సో అందుకే సంవత్సరం అయితే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.