ఈ ఒక్క చిట్కాతో ఎన్ని సమస్యలు దూరమో..!

0
114

సాధారణంగా ఉల్లిపాయ, తేనె రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. వాటిని విడివిడిగా తీసుకునే కన్నా, రెండిటిని కలిపి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఉల్లిపాయలు బాగా మిక్సీ పట్టి రసం తీసుకొని ఇందులో తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం ఒక్కో టీ స్ఫూన్ చొప్పున తీసుకుంటే వాటి నుంచి తొందరగా ఉపశమనం కలిగి ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ చిట్కా అద్భుతంగా ఉపయోగపడతాయి.

బరువు తగ్గాలని అనుకొనే వారు ప్రతిరోజు ఉల్లి రసం,తేనె కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. ఉబకాయంతో బాధపడేవారు ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అంతే కాక ఉల్లి రసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల దంతసమస్యలకయినా మంచి పరిష్కారాన్ని అందిస్తుంది.