పీతలతో గుండె ఆరోగ్యం పదిలం..వారానికి ఎన్నిసార్లు తినాలంటే?

0
106

సాధారణంగా పీతలు తినడానికి చాలామంది ఇష్టపపడరు. ఎందుకంటే..అవి చూడ్డానికి కాస్త తేడాగా ఉండడం వల్ల తినేందుకు ఎవరూ అంత ఇంట్రస్ట్‌ చూపరు. కానీ పీతలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?

పీతల్లో విటమిన్ B12, ఫోలేట్ ,ఇనుము, నియాసిన్, సెలీనియం, జింక్పీతలో, ప్రోటీన్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి మరియు నిర్వహించడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలను మనదరికి చేరకుండా కాపాడడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి.

వారానికి ఒకసారి పీతతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. పీతలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ముఖ్యమైన పోషకాలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంతో పాటు.. క్రమరహిత హృదయ స్పందన లేకుండా చేయడంలో కూడా పీతలు తోడ్పడుతాయి.