మనం నోటీ సమస్యలు లేకుండా ఉండాలి అని బ్రష్ చేస్తాం, అయితే అప్పుడప్పుడూ కాదు నిత్యం ఏమి తిన్నా నోటిలో నీరు పోసి పుక్కలించాలి అని పెద్దలు చెబుతారు వైద్యులు ఇదే చెబుతారు.. దీని వల్ల చెడు బ్యాక్టిరీయా మననోటిలో ఉండదు అని చెబుతారు, అందుకే ఈ విషయంలో డాక్టర్లు చెప్పిన మాటని చాలా మంది ఫాలో అవుతారు, వేడి నీరు ఉప్పు నీరు పుక్కలించడం వల్ల పలు దంత సమస్యలు తొలగిపోతాయి.
అయితే తాజాగా మరో విషయం తెలియచేస్తున్నారు నిపుణులు, రోజుకి రెండు సార్లు బ్రష్ చేసేవారు కూడా ఉంటారు, అయితే ఇప్పుడు మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలి అంటే,రోజుకు మూడు సార్లు బ్రష్ చేయమంటున్నారు కార్డియాలజిస్టులు..
నోరు పరిశుభ్రంగా ఉండడంతో పాటు గుండె వ్యాధులను నిర్మూలించవచ్చని నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలింది.
నోటి బ్యాక్టీరియాలో ప్యాంక్రియాటిక్ మరియు ఎసోఫాగియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని సూచించే సమాచారాన్ని పరిశోధకులు కనుగొన్నారు. చిగురు సమస్యలు కూడా గుండెపై ప్రభావం చూపిస్తాయి.. తీవ్రమైన చిగుళ్ళ వ్యాధి రక్తపోటుకు సంకేతం. ఆహారం తిన్న వెంటనే పుక్కిలించడం వంటివి చేయండి.