తినే ఆహారపదార్దాలకు రుచి ఇస్తుంది ఉప్పు… అంతే ఆరోగ్యానికి చేటు చేస్తుంది.. అందుకే ఉప్పు తగ్గిస్తే సగం జబ్బులు తగ్గుతాయి అంటారు వైద్యులు… పంచదార ఉప్పు ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా డేంజర్…
ఈ రెండూ తక్కువ తింటే ఎంత ప్రమాదమో… ఎక్కువ తింటే కూడా అంతే ప్రమాదం. ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయి.
ఉప్పు తినడం తగ్గిస్తే చాలా మందికి గుండె జబ్బులు రాకుండా చేయవచ్చు…. ఉప్పు ఎక్కువ అయితే శరీరానికి చేటు ఏమిటి అంటే గుండె జబ్బులతోపాటూ… కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ల నొప్పులు, బీపీ పెరగడం ఇలా చాలా జబ్బులు వస్తాయి. మీరు ఆకుకూరలు పప్పు వండింతే అందులో ఉన్న ఉప్పు చాలు కాని మళ్లీ యాడ్ చేస్తారు ఇలా శరీరంలో అవసరానికి మించి ఉప్పు చేరుతోంది…
తాజాగా సర్వే ప్రకారం రోజూ మనిషి 8.38 గ్రాముల ఉప్పు తింటున్నాడట…రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలి అంతకు మించి వద్దు అంటున్నారు వైద్యులు.కూరలు ఫ్రైల్లో ఉప్పు వాడకం తగ్గించాలి. పచ్చళ్ల బదులు కూరగాయలు, ఆకుకూరలతో చేసిన వంటలు తినాలి. పండ్లు సలాడ్లు పెరుగు ఇలా వాటిలో ఉప్పు వేసుకోవద్దు.
|
|
|
ఉప్పు అతిగా తింటున్నారా అసలు ఎంత ఉప్పు రోజూ తీసుకోవాలి
-