స్త్రీలు అందంగా ఉండడానికి ఎల్లప్పుడూ వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఆశించినా మేరకు ఫలితాలు రాకపోవడంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. అలాంటి వారు సాధారణంగా మనందరి ఇళ్లలో దొరికే వెన్నతో శరీర కాంతిని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలానో తెలుసుకోవాలని మీరు కూడా ఆసక్తిగా ఎదుచూస్తున్నారా? మరి ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..
వెన్నలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతోపాటు విటమిన్ డి, విటమిన్ ఇ లు అధికంగా ఉండడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా..చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంలో కూడా వెన్న ఎంతగానో ఉపయోగపడుతుంది. వెన్నను ముఖానికి రాసుకుని మెత్తటి సున్నిపిండిలో పసుపును కలిపి ముఖానికి రుద్దుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకు స్నానం చేయించడానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల పిల్లల చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే సన్నని వెంట్రుకలు కూడా పోతాయి. లిప్ స్టిక్ లను, లిప్ బామ్ లను వాడడానికి బదులుగా వెన్నలో గులాబీ రెక్కల పేస్ట్ ను కలిపి రాసుకోవడం వల్ల పెదవులు పింక్ రంగును సంతరించుకోవడమే కాకుండా ఎండిపోకుండా కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.