ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి ఇవి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా

How to increase platelets

0
98

ఈ మధ్య మనం చాలా మంది దగ్గర ఈ మాట వింటున్నాం ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అని. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయి. డెంగీ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. చివరకు ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్దితి వస్తుంది.
ముఖ్యంగా వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఒకవేళ మీకు ఏ గాయం శరీరంపై లేకపోయినా రక్తస్రావం జరుగుతోంది అంటే వెంటనే వైద్యులని సంప్రదించండి. మన బాడీలో తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి.

ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుంది. ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. ఇక ఇవి పెరగాలి అంటే కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆప్రికాట్ పండ్లను రోజు రెండు సార్లు తీసుకుంటే చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్లెట్స్ పెరుగుతాయి.

ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా మంచిదే. బొప్పాయి పండు డెంగీ వ్యాధికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దానిమ్మరసం పండు తీసుకున్నా మంచిదే. ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. వెల్లుల్లి అలాగే బీట్ రూట్ క్యారెట్ కూడా తరచూ తీసుకోండి.