అతి బరువు ఊబకాయం శరీరానికి చాలా చేటు. ఈ కొవ్వు ఏకంగా మన అవయవాలపై దారుణమైన ప్రభావం చూపిస్తుంది.కాలేయంలో ఇటీవల చాలా మందికి కొవ్వు పేరుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఆహరం, మన డైట్, అలాగే మనకు ఉన్న అలవాట్లు. వీటి వల్ల కాలేయం దెబ్బతింటోంది.
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పడు ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది చూద్దాం? మనం తిన్న ఆహారం వల్ల కొవ్వు పేరుకుపోతే అది కాలేయంలో నిల్వ ఉంటుంది. శరీరానికి తగిన వ్యాయామం కచ్చితంగా ఉండాలి లేకపోతే ఈ సమస్య మరింత వేధిస్తుంది. ఊబకాయం సమస్య ఉన్న వారికి అలాగే షుగర్ సమస్య ఉన్న వారికి ఈ వ్యాధి ఇబ్బంది పెడుతోంది.
ఏదైనా అనారోగ్యంతో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడేవాళ్లలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక కొందరు గర్భం రాకుండా మాత్రలు వాడుతున్నారు, నెలకి ఐదు నుంచి ఆరు డోసులు తీసుకునే మహిళలకు కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య వచ్చినప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.కడుపులో కుడిభాగంలో బరువుగా అనిపించడం, చిన్నగా కడుపునొప్పి వస్తూ తగ్గడం, మీకు ఇలాంటి సమస్య వస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. స్కానింగ్ అలాగే రక్తపరీక్షల్లో ఇది తేలుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తీపి పదార్థాలు, నూనెతో చేసిన పదార్థాలు తినవద్దు, నిత్యం వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి.