మీ ఇంట్లోనే ఎలక్ట్రోలైట్ వాటర్ ఇలా తయారు చేసుకోండి

how to make electrolyte water in your home

0
63

ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సింది మన శరీరానికి తగినంత నీరు రోజూ తాగాలి. కొందరు అస్సలు నీరు ఎక్కువ తాగరు దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడతాయి . ముఖ్యంగా నీరు శరీరానికి అందించకపోతే ద్రవాల సమతుల్యం దెబ్బతింటుంది.
శరీరం వేడి ఎక్కినట్లు అనిపిస్తుంది నీరసంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే మనం తక్షణ శక్తి కోసం ఎలక్ట్రోలైట్స్ డ్రింక్ ను తాగుతాం.

ఎక్కువ సేపు శారీరక శ్రమ చేసిన వారు, వ్యాయామం చేసినవారు క్రీడాకారులు వీటిని ఎక్కువ తీసుకుంటారు. చాలా మంది చెమట అధికంగా పట్టిన వెంటనే ఇలా తాగుతారు. ఈ డ్రింక్ చెమట వలన కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ను భర్తీ చేస్తుంది. మనకు కావల్సిన శక్తిని అందేలా చేస్తుంది. డీ హైడ్రేషన్ బారిన ఎవరైనా పడితే వెంటనే ఎలక్ట్రోలైట్స్ డ్రింక్ తాగుతారు.

మనకు నిత్యం పోషకాలు అవసరం అందులో మినిరల్స్ కావాల్సి ఉంటుంది . వీటినే ఎలక్ట్రోలైట్స్ అని అంటారు. ఇవి మన శరీరానికి తినే ఆహారం, తాగే ద్రవ పదార్ధాల ద్వారా అందుతాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం ఈ మినరల్స్ ను ఎలక్ట్రోలైట్స్ గా చెబుతారు. మనం ఇంటిలోనే దీనిని తయారు చేసుకోవచ్చు ఎలా అనేది చూద్దాం? పావు లీటర్ నీటిని తీసుకుని అందులో పావు టీ స్పూన్ ఉప్పు, పావు కప్పు నిమ్మరసం, ఒకటిన్నర కప్పుల కొబ్బరి నీరు వేసి బాగా కలపాలి. మీకు నీరసం అనిపించిన సమయంలో ఈ నీరు తాగితే తక్షణ శక్తి వస్తుంది.