కాలాలకు అతీతంగా దొరికే పండ్లను తింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా వేసవిలో మామిడిపండ్లు ఎప్పుడెప్పుడా వస్తాయని అందరు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. మామిడి పండ్లను పరిమిత స్థాయిలో తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ మార్కెట్లో దొరికే మామిడి పండ్లను తిన్నామంటే సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం..
మామిడి పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నపటికి..మార్కెట్ లో దొరికే పండ్లను మాత్రం తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిని వివిధ రకాల కెమికల్స్ వాడి మగ్గపెట్టడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతోంది. అంతేకాకుండా మగ్గబెట్టిన మామిడి పండ్లు అంత రుచిగా కూడా ఉండవు.
కావున మన సహజసిద్ధమైన చిట్కాలు పాటించి ఇలా ఈసీగా మగ్గపెట్టుకోండి. మొదటగా మూత ఉండే ప్లాస్టిక్ డబ్బాను కానీ, స్టీల్ డబ్బాను కానీ తీసుకొని అడుగు భాగంలో కొద్దిగా బియ్యాన్ని పోసి పచ్చి మామిడి కాయలను ఉంచాలి. వీటిపై మరలా బియ్యాన్ని పోసి మళ్లీ కాయలను పెట్టాలి. ఇలా 8 రోజుల పాటు వాటి మూత తీయకుండా ఉంచడం వల్ల కాయలు పండ్లుగా మారడాన్ని మనం చూడవచ్చు. ఇవి కేవలం రుచిని పెంచడమే కాకుండా..ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.