తలనొప్పి(Headache).. ఈ పరుగుల ప్రపంచంలో చాలా సాధారణ సమస్యలా మారిపోయింది. వంద మందిలో 90 మంది తలనొప్పితో బాధపడుతున్న వారేనని స్టడీస్ చెప్తున్నాయి. ఈ సమస్యకు వయసు పరిమితి ఏమీ లేదు. చిన్నారుల్లో కూడా ఈ తలనొప్పి బాధను చూడొచ్చు. ఈ తలనొప్పి సమస్య ప్రస్తుతం సర్వసాధారణమే అయినా.. ఇది మన రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నచిన్న పనులు చేయడానికి కూడా ఈ తలనొప్పి తీవ్ర అడ్డంకిగా మారుతుంది. పక్కన ఉండే వాళ్లు ప్రేమగా పలకరించిన తీవ్ర చికాకు వచ్చేలా చేస్తుంది. ఈ తలనొప్పికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉండొచ్చు.
కానీ చాలా వరకు ఒత్తిడి, అధికమైన ఆందోళన, అలసట, పని ప్రభావం, ఏదైనా చెడు అలవాటు, వేళకు ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేమీ లేదా అతి నిద్ర కూడా తలనొప్పికి కారణం కావొచ్చని చెప్తున్నారు వైద్యులు. అంతేకాకుండా ఈ మధ్య చాలా మందిని ఎల్‌ఈడీ స్రీన్ వల్ల వస్తున్న తలనొప్పే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించామని వైద్యులు వివరిస్తున్నారు. కొన్నికొన్ని సందర్భాల్లో ఈ తలనొప్పి తీవ్ర సమస్యలా మారి ఆ బాధ భరించలేదిగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మనకు నచ్చినవాటిని కూడా తీవ్రంగా ధ్వేషించేలా చేస్తుందీ తలనొప్పి.
అయితే చాలా మంది తలనొప్పి(Headache) వస్తే వెంటనే ఇంటి దగ్గర్లోని మెడికల్ షాపుకు వెళ్లి ట్యాబ్లెట్లు తీసుకుని వేసేసుకుంటారు. అయినా తగ్గని పరిస్థితుల్లో డాక్టర్లను కన్సల్ట్ అయి వారు రాసి ఇచ్చే మందులను తీసుకుంటారు. ఇలా ప్రతి రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవడం ప్రస్తుత యువతకు పరిపాటి అయిపోతుంది. కానీ పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. కొందరికి తలనొప్పి ఎంత పెద్ద సమస్యలా మారిందంటే వాళ్లు రోజు మూడు నాలుగు తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి వారు మరింత అధిక ప్రమాదంలో ఉన్నారని నిపుణులు చెప్తున్నారు.
ప్రతి రోజూ పెయిన్ కిల్లర్లు వేసుకుంటేనే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటే మరి రోజుకు మూడు నాలుగు ట్యాబ్లెట్లు వేసుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని వైద్యులు అంటున్నారు. అయితే ఈ తలనొప్పిని ట్యాబ్లెట్లు వేసుకోకుండా కంట్రోల్ చేయొచ్చని వైద్యులు అంటున్నారు. వీటి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. మన జీవనశైలిలో సరైన మార్పులు చేసుకోవడం ద్వారానే తలనొప్పిని తగ్గించుకోవచ్చంటున్నారు వైద్యులు. మరి చిట్కాలేంటో ఒకసారి చూసేద్దామా..
అల్లం టీ: అల్లం టీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ(Anti Inflammatory) గుణాలు ఉన్నాయి. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మందికి కూడా మానసిక నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
విశ్రాంతి: భరించలేని తలనొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి విషయాన్ని ఆలోచించకుండా వదిలేస్తే బాగా నిద్ర ప్రయత్నించండి.
నట్స్ తినండి: నట్స్ మానసిక ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. వాల్నట్లు, బాదంపప్పులు, జీడిపప్పు వంటి గింజలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే వాటిలో మంచి మొత్తంలో మెగ్నీషియం(Magnesium) ఉంటుంది.. ఇది తలనొప్పిని దూరం చేస్తుంది.
హైడ్రేషన్: తలనొప్పికి ఒక సాధారణ కారణం శరీరంలో నీరు లేకపోవడం. రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్(Dehydration) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
యోగా – ధ్యానం: ధ్యానం మానసిక ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇది సాధారణ రోజుల్లో కూడా చేయాలి. రోజూ దీన్ని ఆచరించడం వల్ల ఒత్తిడిని తగ్గించి, తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.