ఆనందయ్య మందులో వాడే తిప్పతీగను మనం ఇంట్లోనే ఎలా వాడాలి ?

0
239

తిప్ప తీగ గురించి నేడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సందర్భం. పల్లెటూర్లు మొదలుకొని పట్టణాల వరకు తిప్ప తీగ కావాలంటున్నారు. తిప్పతీగలో ఉన్న ఔషధాల కారణంగానే ఈ ఆకుకు ఎనలేని డిమాండ్ పెరిగింది. అంతేకాదు కరోనా లాంటి వైరస్ ల దాడినుంచి రక్షణ కావాలంటే తిప్ప తీగ కావాల్సిందే అంటున్నారు.

 

ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య తాను తయారు చేస్తున్న కరోనా మందులో తిప్పతీగను వాడుతున్నారు. తిప్పతీగను మనం ఇంట్లో ఉండి ఎలా వాడుకోవాలో సూచిస్తున్నారు ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు. ఆయన ఈ మేరకు ఒక వీడియో  రిలీజ్ చేశారు. తిప్ప తీగను ఏ ఏ పద్ధతుల్లో వాడుకోవచ్చో వివరించారు. ఆ వివరాలు చదవండి.

 

పల్లెటూర్లలో ఫ్రెష్ తిప్పతీగ దొరుకుతుంది. అలా దొరికిన తిప్పతీగ ఆకులను పసరు చేసి ముద్ద చేసి ఆ ముద్దలను అలాగే మింగేయొచ్చు. ఇది మొదటి రకం విధానం.

 

ఇక తిప్పతీగ పొడి మార్కెట్ లో రెడీగా దొరుకుతుంది. ఆ ఆకు పొడిని తెచ్చుకుని ఒక స్పూన్ పొడిని లీటర్ నీటిలో కలుపుకుని బాగా మరగబెట్టాలి. ఎంతగా మరగబెట్టాలంటే… లీటర్ నీళ్లు కాస్తా అర లీటర్ అయ్యే వరకు మరగబెట్టాలి. తర్వాత దాన్ని ఒడగట్టి ఆ నీటిని తాగాలి. ఇది రెండో పద్ధతి.

 

తిప్పతీగ పొడిలో తేనె కలుపుకుని రెండు మూడు ముద్దలు చేసి వాటిని తినొచ్చు. ఇది మూడో పద్ధతి.

 

తిప్పతీగ రసాన్ని మార్కెట్లో తెచ్చుకుని లీటర్ నీటిలో 15ఎంఎల్ లేదా 20 ఎంఎల్   తిప్పతీగ జూస్ కలుపుకుని తాగొచ్చు. ఇది నాలుగో పద్ధతి. అయితే ఈ జ్యూస్ నిలువ చేస్తారు కాబట్టి సేఫ్ కాదు. పై మూడు రకాలే మంచిది. అని డాక్టర్ మంతెన తన వీడియోలో వివరించారు.

ఇది కూడా చదవండి…

ఆనందయ్య మందులో వాడే తిప్పతీగతో ఇవీ లాభాలు : డాక్టర్ మంతెన