కుటుంబానికి ఇద్దరు పిల్లలు అనేది గతంలో వినిపించేది.. ఇప్పుడు బాగా ఆర్ధిక పరిస్దితి ఉంటే ముగ్గురిని కూడా కంటున్నారు, లేదా మిడిల్ క్లాస్ గా పూర్ గా ఉంటే ఒకరు చాలు అనుకుంటున్నారు..అయితే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మాత్రం ఆ ఇంటిలో తిప్పలు తప్పవు , ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి, పిల్లలకు సరైన చదువు అందివ్వలేరు, అయితే ఏకంగా 45 ఏళ్ల మహిళ 16 వ బిడ్డకు జన్మనిచ్చింది. కాని ఈ సమయంలో ఆమె చనిపోయింది.
నిజంగా ఈ ఘటన అందరిని కలిచివేసింది..మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలో సుఖ్రానీ అహిర్వార్ అనే 45 ఏళ్ల మహిళ తన 16 వ బిడ్డకు జన్మనిచ్చింది..కానీ ప్రసవించిన కొద్దిసేపటికే తల్లీ బిడ్డా మరణించారు. ఆమె ఇంట్లో ప్రసవించింది, కొద్ది సేపటికి ఇద్దరి పరిస్దితి విషమించింది దీంతో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.. కాని అప్పటికే సీరియస్ అవ్వడంతో చనిపోయింది ఆమె.
అహిర్వార్ అప్పటికే 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది..వారిలో ఏడుగురు బిడ్డలు చనిపోయారు. అహిర్వార్ కు ఇది 16వ ప్రసవం. ఇలాంటి దయచేసి చేయద్దు అని ఇద్దరు పిల్లలతో చాలు అని వైద్యులు కూడా చెబుతున్నారు.. మొత్తానికి ఈ ఘటనతో గ్రామస్తులు కన్నీరు పెట్టారు.