ఉత్తరాధిన పిడుగుపాటు వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. 22 మరణాలు ఒక్క రాజస్థాన్‌లోని అమేర్‌లోనే సంభవించాయి. వర్షాకాలంలో మన తెలుగు స్టేట్స్ లో కూడా పిడుగులు భయపెడుతున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మరణం నుండి కాపాడవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
మెరుపులు వచ్చినప్పుడు మీరు భవనం నుండి బయట ఉంటే మీరు ఒకటి నుండి 30 వరకు లెక్కించడం ప్రారంభించండి. కౌంటింగ్ పూర్తయ్యే ముందు, మీరు ఉరుము శబ్దం వింటే, మీరు అక్కడ ఉండడం ప్రమాదం.
వెంటనే ఇంటిలోపలకి వెళ్లిపోవాలి
పొడవైన చెట్ల కింద ఎట్టి పరిస్థితిలోనూ ఉండవద్దు.
ఎత్తైన టవర్లు, చెట్లు, రైలు పట్టాలకి దూరంగా ఉండాలి
ఎలక్ట్రానిక్ వస్తువులను మొబైల్స్, ట్రాన్స్‌ఫార్మర్‌లు, రేడియోలు, టోస్టర్‌లు, యాంటెనాలకు దూరంగా ఉండాలి.
నీటి కొలను కాలువ సరస్సులు దగ్గర కూడా ఉండవద్దు.