కల్తీ పాలను ఇంట్లోనే ఈజీగా గుర్తించండిలా..

0
119

పాలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. చాలా మంది ఉదయం లేవగానే పాలు తాగుతుంటారు. పిల్లలు, యువకులు, పెద్దలు, వృద్దులు వయసుతో సంబంధం లేకుండా అందరూ పాలను లాగించేస్తారు. అయితే మనం తీసుకునే పాలు మంచివా? కల్తీవా? అనే సంగతి పట్టించుకోరు. అయితే పాలపై మీకు అనుమానం కలిగితే ఇంట్లోనే ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.

పాలు మరుగుతున్నప్పుడు దాని వాసన మెల్లగా మొదలవుతుంది. సింథటిక్ పాలను దాని చెడు రుచి, వాసన ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఒక్కోసారి పాలు సబ్బు వాసన వస్తుంటాయి. మీరు ఆ పాలను చేతి వేళ్లతో తీసుకుని కూడా చెక్‌ చేయవచ్చు. కొంచెం పాలను తీసుకుని చేతిలో వేసుకుని రుద్దినట్టయితే..కాస్త సబ్బుగా అనిపిస్తే రసాయనాల మిశ్రమంతో తయారైందని అర్థం.

పాలు కింద పడిపోయినప్పుడు, అది వెంటనే ప్రవహిస్తుంది. దాదాపు అందరికీ ఇదే తెలుసు. కానీ, అసలు పాలు ఎలా ప్రవహిస్తాయో తెలుసా? పాలలో కల్తీని అరికట్టడానికి ఇది సులభమైన మార్గం. ఏదైనా మృదువైన ఉపరితలంపై 2-3 చుక్కల పాలను వేయండి. అది మెల్లగా ఏదో ఒకవైపుకు పారుతుంది. అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలే. కల్తీ పాలు అయితే వేగంగా పారుతాయి. పాలు పారిన దారిలో తెల్లగా ఏమీ కనిపించదు.

యూరియా.. పాల కల్తీకి అత్యంత సాధారణ రూపం. ఇది రుచిని మార్చదు. గుర్తించడం చాలా కష్టం. యూరియా ప్రమాదకరమైనది. మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. పాలలో యూరియాను గుర్తించేందుకు లిట్మస్ పేపర్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం.. కొన్ని పాలు, సోయాబీన్ లేదా సోయాబీన్‌ని వేసి పొడి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత అందులో ఎర్రని లిట్మస్ పేపర్ ముంచాలి. ఆ పేపర్ ఎరుపు రంగు నుండి నీలి రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్టే. ఆ పాలు విషంతో సమానం.