రైతులు ఈ పంటలు వేస్తే లక్షల్లో ఆదాయం..అవేంటో తెలుసా?

0
96

లాక్ డౌన్ కారణంగా ఏ రంగంపైనైనా తక్కువ ప్రభావం పడిందా అంటే అది వ్యవసాయ రంగం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా చాలా మంది కోవిడ్ 19 దెబ్బకి సొంత ఊర్లకు వచ్చి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. రైతులు పంటలు పండించిన ధరలు బాగా రాకపోవడంతో నష్టపోతున్నారు. అలా నష్టపోకుండా, చక్కటి లాభాలు అలాగే వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయం పొందాలంటే ఈ పంట పండించాల్సిందే.

చాలా మంది రైతులు సాంప్రదాయ పంటలను పండిస్తూ ఉంటారు. వాణిజ్య పంటలతో పాటు సంప్రదాయ పంటలపైన రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఎక్కువగా రైతులు మొక్కజొన్న, పత్తి, వరి, వేరుశనగ వంటి వాటిని పండిస్తారు. అలాగే కూరగాయలను కూడా పండిస్తూ ఉంటారు. అయితే ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి ధరలు బాగా రాకపోవడంతో నష్టపోతుంటారు. అయితే అలా కాకుండా మంచిగా రైతులు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయం లభించే పంటలను పండించాలి.

లెమన్ గ్రాస్ ని పండించడం వల్ల రైతులు చక్కగా లాభాలు పొందొచ్చు. నిమ్మ గడ్డి నుంచి తీసిన ఆయిల్ కు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో వాడుతూ ఉంటారు. ఇది అన్ని రకాల భూముల్లో కూడా పండుతుంది. కాబట్టి ఇబ్బంది లేదు. పైగా దీనికి ఎక్కువగా నీళ్లు కానీ ఎరువులు కానీ అవసరం లేదు.

మీరు కేవలం వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఈ విత్తనాలని ఒక్కసారి నాటితే నాలుగేళ్ల వరకు పంట వస్తుంది. విత్తనాలను ఫిబ్రవరి నుంచి జూలై మధ్య లో నాటాలి. ఒక ఎకరానికి రెండు కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఈ గడ్డి నాటిన మూడు నుండి నాలుగు నెలల్లోనే కోసేయాలి. అప్పుడు పంట కూడా వెంటనే వస్తుంది. ఈ గడ్డి నుంచి తీసిన నూనెను ఒక లీటర్ కి వెయ్యి రూపాయల నుంచి 1500 వరకు ధర పలుకుతుంది. మార్కెట్ రేట్ ని బట్టి సుమారు నాలుగు లక్షల వరకు కూడా సంపాదించవచ్చు.