మగవారు అందంగా కనిపించాలంటే..ఇలా చేయండి

If men want to look beautiful..do this

0
84

కొంతకాలంగా స్త్రీలకు దీటుగా మగవారు కూడా ఫ్యాషన్ ​వైపు మొగ్గు చూపుతున్నారు. తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చర్మం పట్ల సరైన జాగ్రత్త తీసుకుంటేనే అందం మరింత రెట్టింపు అవుతుంది. దీని కోసం మగవారు చర్మం పట్ల ఎలాంటి కేర్​ తీసుకువాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో తెల్లగా కనిపించేందుకు మగవారు కూడా పార్లర్​ల చుట్టూ తెగ తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మగవారు తమ చర్మాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

ఉదయం నిద్ర లేవగానే ముఖాన్ని చల్లటి నీరుతో కడగాలి.

ప్రతిరోజు సాయంత్రం తలస్నానం చేయాలి.

నిత్యం ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల మొటిమలు, రాషెస్ రావు.

సరైన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఫలితంగా ముఖం​ కాంతివంతంగా మారుతుంది. డైట్​లో ఎక్కువగా పాలకూర తీసుకోవాలి.

మధ్యాహ్నం పూట ఎక్కువగా తిరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. శరీరం పూర్తిగా కనపడకుండా ఉండే బట్టలు వేసుకోవాలి.

సిగరెట్​ను పూర్తిగా మానేయడం వల్ల చర్మం ముడతలు పడవు.

ఇలా చేయండి అందంతో పాటు ఆరోగ్యంగా ఉండండి.