ప్రతీ శనివారం నవగ్రహాలకు ముఖ్యంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసేవారిని చాలా మందిని చూసి ఉంటాం. తమ గ్రహాల ప్రభావం వల్ల ఇలా శని దోష నివారణ పూజలు కూడా చేస్తారు. ఎందుకంటే శనిదోషం పడితే చాలా సమస్యలు వేధిస్తాయి.
వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు కుటుంబంలో కలహాలు ఇలా అన్నీ చుట్టుముడతాయి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.
శనివారం నాడు త్రయోదశి వస్తే అది శని త్రయోదశి అంటారు. ఈరోజు శని బాధలు ఉన్న వారు ఆ శనీశ్వరుడ్ని పూజించాలి. ఎలా పూజ చేయాలి అనేది చూద్దాం. ఉదయం శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి.
మీరు పూజ తైలాభిషేకం చేసిన తర్వాత ఆ గుడి నుంచి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదు.
ఏలినాటి శని, అష్టమ శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి నాడు ప్రత్యేక పూజలు చెయ్యాలి. ఈరోజు ఎందుకు ఇలా పూజలు చేస్తారు అంటే శని త్రయోదశి అనేది శనిదేవుడు జన్మించిన తిథి కాబట్టి ఈరోజు పూజలు చేస్తే ఆయన ప్రభావం మనపై ఉండదు అంటారు.
నువ్వుల నూనెతో ఆయనకు కుడిచేత్తోనే అభిషేకం చేయాలి
నల్ల నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టాలి
పేదలకు వస్త్రాలు ఇవ్వాలి
కాకులకి ఆహారం పెట్టడం మంచిది