చాలా మంది మంచి శరీర సౌష్ఠవం కోసం నిత్యం జిమ్ ఎక్సర్ సైజులు చేస్తారు, అయితే ఇలా అతిగా మాత్రం చేయద్దు అంటున్నారు వైద్యులు, పలు కారణాలు చెబుతున్నారు, అయితే ఉదయం సాయంత్రం రోజు రెండు గంటలు ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఒకవేళ అంతకంటే ఎక్కువ సేపు చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తున్నాయట..పిల్లలు పుట్టేందుకు శరీరంలోని కొవ్వు కూడా సాయం చేస్తుంది. అయితే, మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుంది. ఇలా అవ్వడం వల్ల కొందరికి సంతాన సమస్యలు వస్తున్నాయి, అయితే సమానంగా ఉండేలా జిమ్ ఎక్సర్ సైజ్ చేయాలి, కొవ్వు బాగా తగ్గించుకున్నా సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు.
ఇక జిమ్లో ఎక్కువగా కష్టపడే మగవారిలో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు వారానికి ఐదుగంటలు ఎక్సర్సైజ్ చేస్తే చాలు.. పురుషులు కనీసం 15 గంటలు వారానికి ఎక్సర్ సైజ్ చేయాలని చెబుతున్నారు. సో అందుకే ఈవిషయంలో జాగ్రత్త గా సమయం ప్రకారం జిమ్ చేయండి.