ఫోన్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు ప్రమాదం పొంచివున్నట్లే..!

0
108

ఈ మధ్యకాలంలో చిన్నపెద్ద అని తేడా లేకుండా అందరు ఫోన్ వాడుతున్నారు. ఉదయం మొదలు పెడితే మళ్ళి రాత్రి పడుకునే వరకు ఫోన్ వడుతూనేవుంటారు. మరికొంతమందయితే పక్కన ఫోన్ లేనిదే కనీసం నిద్రకూడా పోరు. ఫోన్ నుండి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా కళ్ళు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఫోన్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

అతిగా ఫోన్ వాడడం అంటే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా రాత్రి సమయంలో చాలామంది దిండు కింద ఫోన్ పెట్టుకొని పడుకుంటారు. దానివల్ల అత్యధికమైన రేడియేషన్ విడుదలయి మెదడుపై ప్రభావం పడి మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, తలతిరగడానికి కూడా గల కారణాలు ఫోన్ దిండు కింద ఫోన్ పెట్టుకోవడమే.

అందుకే వీలయినంత వరకు దిండు కింద ఫోన్ పెట్టుకోకపోవడమే మంచిది. సిగ్నల్ తక్కువగా ఉన్నపుడు ఫోన్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే సిగ్నల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేయడం కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఫోన్ ను చొక్కా జేబులో పెట్టుకోవడం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది. కావున వీలయినంత ఫోన్ ను దూరంగా ఉండడం మంచిది.