ఇలా చేస్తే అన్నం తిన్నా..బరువు త్వరగా తగ్గుతారట..!

0
115

మనలో కొంతమంది లావుగా ఉన్నామని బాదపడితే..మరికొందరు సన్నగా ఉన్నానని తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్లు సన్నగా అవ్వడం కోసం తక్కువ అన్నం తినడంతో పాటు..అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఆశించిన మేరకు ఫలితాలు లభించకపోగా సరైన ఆహారం లేక వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఎంత ఎక్కువగా ఆహారం తీసుకున్నా కొందరు ఫిట్ గా ఉండటానికి సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా అలాగే చేస్తే బరువు పెరిగే సమస్య ఉండదు. బరువు అధికంగా పెరగకుండా ఉండాలంటే కంటినిండా నిద్ర చాలా అవసరం. ఒక రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్రపోవడం వల్ల బరువు పెరగకపోవడంతో పాటు..ఎలాంటి సమస్యలకైనా ఇట్టే చెక్ పెడుతుంది.

ఎక్కువగా నిద్రపోనీ వారిలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి సమస్యలువచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. చక్కర ఎక్కువగా వినియోగిస్తున్న వారులో బరువుపెరగడంతో పాటు..అనేక ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కావున చక్కర వినియోగం తగ్గిస్తే మంచిది.