రోజు ఇన్ని వేపాకులు తిన్నారంటే మీ ఆరోగ్యం పదిలం..కానీ మితి మీరితే ప్రమాదమే..!

0
94

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. మన ఆరోగ్యం పదిలంగా ఉండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలను సైతం ఇష్టం చేసుకొని తింటుంటాము. అలాగే సాధారణంగా వేపాకులను తినడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇష్టం చేసుకొని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు? రోజుకు ఎన్ని ఆకులు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వేపాకులు ఆరోగ్యానికి చేసే లాభాలు అన్నిఇన్ని కావు. కడుపులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల వంటి వాటితో పోరాడి మనల్ని కాపాడుతుంది. కానీ వేపాకులను అతిగా తింటే సమస్యలను కొని తెచుకున్నట్టే అంటున్నారు నిపుణులు. అందుకే రోజుకు కనీసం 6 నుంచి 8 వేప ఆకులను మాత్రమే తీసుకుంటే మంచి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

ముఖ్యంగా పరిగడుపున వేపాకులు తినడం వల్ల రోదనిరోధక శక్తిపెరుగుతుంది. కాన్సర్ బారిన పడకుండా చేయడంలో కూడా వేపాకులు సహాయపడతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులు తినడం వల్ల శరీరంలోని విషపూరిత పదార్థాలు, మలినాలు దూరమై హానికరమైన వ్యాధులను మనదరికీ చేరకుండా కాపాడుతుంది.