కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా భారతీయ రైల్వే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని సర్వీసులు మాత్రమే నడుపుతోంది. అంతేకాదు ప్రతీ స్టేషన్లో ప్రయాణికులు కచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే వారికి ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. ముందుగానే బెర్త్ కన్ఫామ్ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్ లోకి అనుమతిస్తున్నారు.
సామాజిక దూరానికి సంబంధించి అనేక నియమాలు రూపొందించబడ్డాయి. ప్రయాణికుడు రైల్వే స్టేషన్ స్క్రీనింగ్లో అనర్హులుగా భావిస్తే అంటే వారికి జ్వరం లేదా కరోనా లక్షణాలు ఉంటే వారికి ట్రైన్ ఎక్కనివ్వరు. ఆ ప్రయాణం కాన్సిల్ చేసుకోవాల్సిందే.
రైల్వేస్టేషన్ స్క్రీనింగ్లో ప్రయాణికుల ఉష్ణోగ్రత తీసుకుంటారు. ఎక్కువగా ఉంటే ప్రయాణికులను ఆపుతారు. రైల్వే స్టేషన్లో చేసిన స్క్రీనింగ్లో అనర్హులుగా కనిపించిన ప్రయాణికులకు టికెట్ తిరిగి ఇవ్వబడుతుంది. వారు ప్రయాణం చేయకపోతే వారికి నగదు వాపస్ ఇస్తారు.
ప్రయాణికుడు 10 రోజుల్లోపు టిడిఆర్ దాఖలు చేయాలి. ఇలా టీడిఆర్ ఇచ్చిన వారికి మాత్రమే నగదు వాపస్ చేస్తారు.