మన ప్రపంచంలో చాలా మందిని షుగర్ సమస్య వేధిస్తోంది, ముఖ్యంగా ఈ సమస్య ఉంటే తీపి పదార్ధాలు ఏమీ తీసుకోరు, అయితే చక్కెర స్ధాయిలు శరీరంలో పెరుగుతాయి, అందుకే వీటికి దూరంగా ఉంటారు. మరి షుగర్ వ్యాధి వచ్చిన వారు ఫుడ్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.. ఒకేసారి శరీరంలో షుగర్ స్ధాయిలు కూడా పెరగకుండా ఉంటాయి.
మరి షుగర్ స్ధాయి తక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. కచ్చితంగా స్వీట్లకి దూరంగా ఉండాలి, భోజనంలో పాలిష్ రైస్ లేకుండా తృణ ధాన్యాలు చిరు ధాన్యాలు తీసుకోండి, ఆకుకూరలు కూరగాయలు తీసుకోండి, ఇక ఉదయం రాగి జావ తీసుకుంటే ఎంతో మంచిది.. మజ్జిగ ఎక్కువగా తీసుకోండి, కాఫీ టీ ఇలాంటి వాటికి దూరండా ఉండాలి.
డయాబెటీస్ రోగులకు మెంతులు సంజీవనిలా పనిచేస్తాయి. వీటిని నానబెట్టి తిన్నా మంచిదే.
కచ్చితంగా నడక అనేది ఉండాలి రోజుకి 30 నిమిషాలు జాగింగ్ చేయడం వల్ల మీకు చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది..
శరీరానికి తగిన శ్రమ అందిస్తే.. ఇన్సులిన్ కూడా చక్కగా విడుదలై డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఇక ముఖ్యంగా మందుకి దూరంగా ఉండాలి.
గమనిక..
మీకు షుగర్ హెవీగా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులని సంప్రదించాలి.