ఎప్పుడైనా ఎవరైనా ఓ విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి. మనకు రోగనిరోధక వ్యవస్త బాగుంటే ఎలాంటి రోగాలు మన దరికి చేరవు. అయితే చాలా మంది తరకూ జలుబు దగ్గు వస్తుంది అని చెబుతూ ఉంటారు. అయితే నాలుగు రకాల మందులు వేశాక తగ్గుతుంది అని భావిస్తారు. అయితే ఇలా ఇమ్యునిటీ పవర్ తగ్గడం వల్ల కూడా తరచూ జలుబు దగ్గు వస్తాయి. దీనికి గల కారణాలు కచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు.
మీరు ఎక్కువగా ఒత్తిడిగా ఉండకూడదు. ఇక మూడు నాలుగు రోజులకి కాకుండా తరచూ జలుబు ఎక్కువగా వేధిస్తూ ఉంటే ఈ రోగ నిరోధక వ్యవస్ధ సమస్య ఉందేమో గుర్తించాలి. ప్రతీ నెలా ఇలా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా వైద్యులని సంప్రదించాలి. తరచుగా చెవి ఇన్ఫెక్షన్లు వస్తున్నా వైద్యులని సంప్రదించాలి. అంతేకాక మీరు చెవిలో ఏది పడితే అది లిక్విడ్ రూపంలో వేయకూడదు.
జీర్ణవ్యవస్థ పై కూడా ఇమ్యునిటీ పవర్ ఆధారపడి ఉంటుంది. మలబద్దకం విరోచనాలు తరచూ వస్తూ ఉంటే ఈ సమస్య ఉన్నట్లే . శరీర గాయాలు తగ్గకపోయినా పుండ్లు లాంటివి దెబ్బలు తగిలినా అవి తగ్గకపోయినా గాయాలు మానడంలో ఆలస్యం కనిపిస్తే కూడా రోగనిరోధక శక్తి శరీరంలో తగ్గింది అంటారు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందు వైద్యులని సంప్రదించాలి.