పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

0
113

సాధారణంగా పుట్టగొడుగులు తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ వీటిని తినడం కలిగే లాభాలు తెలిస్తే ఇకపై ఇవి ఎక్కడ కనిపించిన కొనుక్కొని తింటుంటారు. పుట్టగొడుగులు శాఖాహారులకు ప్రొటిన్‌ అందించే సూపర్‌ ఫుడ్‌ అని నిపుణులు చెబుతుంటారు. ఎన్నో ఎళ్లుగా పుట్టుగొడుగులను ఆహారంగానూ, ఔషదాల్లోనూ ఉపయోగిస్తున్నారు.

పుట్టగొడుగు మన డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్-బి1, బి2, బి9, బి12, విటమిన్-సి, విటమిన్-డి2 ఉంటాయి.  అంతేకాకుండా పుట్ట గొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.

ఇవి క్యాన్సర్‌ రాకుండా, శరీల అవయవాల్లో ఇన్ఫ్లమేషన్‌ తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. కావున వీటిని మన డైట్‌లో పుట్టగొడుగలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో మష్రూమ్స్‌ మన ఆహారంలో చేర్చుకుంటే  వ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌ దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.