ఇప్పుడు కుంకుడుకాయలు అంటే వందలో ఒకరు లేదా ఇద్దరు వాడుతున్నారు.. ఇప్పడు అంతా షాంపూలు కండిషనర్లు వాడుతున్నారు, దీని వల్ల చాలా మంది కుంకుడుకాయల పవర్ తెలియక వాటిని వాడటం లేదు, అయితే గతంలో అందరూ ఇంటిలో కుంకుడు కాయలు మాత్రమే వాడేవారు.
కుంకుడుకాయల రసంతోనే తలస్నానం చేసే వారు. ఈ కుంకుడు కాయలు వల్ల జుట్టుకి చేకూరే లాభాలేమిటో ఒక్కసారి తెలుసుకుంటే మళ్లీ అవే కుంకుడుకాయల కోసం క్యూ కడతారు.
ఇది షాంపూ కంటే బలంగా పనిచేస్తుంది, చుండ్రు సమస్య తలలో కురుపులు లాంటి సమస్యలు లేకుండా చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది.
స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. ఇక ఒకసారి కుంకుడు రసం పడితే ఇక చుండ్రు సమస్య అస్సలు ఉండదు..కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అందుకే కుంకుడు కాయలు బాగా రసం తీసుకుని దానితో స్నానం చేయండి ఎంతో మంచిది, కుంకుడు కాయలను వేడినీటిలో రాత్రి నానబెట్టి రసం తీస్తే వేగంగా రసం వస్తుంది.