చెప్పుల్లేకుండా నడవడం వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

0
164

పూర్వంలో చాలామంది ప్రజలు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేవారు. కానీ ప్రస్తుతకాలంలో వాకింగ్‌కు షూ, మార్కెట్‌కు వెళ్లాలంటే స్లిప్పర్, ఆఫీస్‌లో ఫార్మల్ షూ, ఆటలకు స్పోర్ట్స్ షూ అంటూ ఇలా రకరకాల చెప్పులు వాడుతూ ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అవుతున్నారు. అందుకే కనీసం ఇంట్లోనైనా చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

రోజు ఒక గంటసేపు చెప్పులేకుండా నడవడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. చెప్పుల్లేకుండా నడవడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా జీర్ణసంబంధిత సమస్యలను కూడా తొలగించుకోవాలంటే రోజు కాసేపు చెప్పులు లేకుండా నడవడం మంచిది.

ఇంకా  చిన్న చిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్తప్రసరణ పనితీరు మెరుగుపడడంతో పాటు..బీపీ కూడా కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడుతుందని నిపుణులు చేబుతున్నారు. అంతేకాకుండా శరీర భంగిమ సరిగ్గా ఉండి..సహనం కూడా పెరుగుతుంది. అందుకే పార్కుల్లో, ఆఫీసుల్లో, ఇంట్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోవడం మంచిది.