తెల్ల ఉల్లి మేలు తెలిస్తే షాకవ్వాల్సిందే..ఆ సమస్యలే దరి చేరవట!

0
137

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. మరి ఉల్లిలో అన్నీ రకాల సుగుణాలు ఉంటాయి. కానీ కొంతమంది ఉల్లిని తినడానికి అసలు ఇష్టపడరు. కానీ ఉల్లితో లాభాలు బోలెడు. అంతేకాదు తెల్ల ఉల్లితో చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. తెల్లఉల్లిలో వుండే పోషకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లి మాములుగా లైట్ పింక్, వైట్ రంగుల్లో వుంటాయి. అన్నింటి కన్నా తెల్ల ఉల్లిలో ఎక్కువ ఆరోగ్యకర సుగుణాలు వుంటాయి. తెల్లఉల్లిలో విటమిన్ సి, ఫ్లేవనోయిడ్స్ న్యూట్రియంట్స్, సల్పర్, మెగ్నీషియం మొదలుగునవి ఎక్కువగా వుంటాయి.

ఇందులో వున్న ఫ్లేవనోయిడ్స్ వల్ల పార్కిన్సన్ వ్యాధులు రాకుండా చేస్తుంది. దీనిలో వుండే సల్పర్ మరియు క్రోమియం బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది.

తెల్ల ఉల్లిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడంవల్ల మధుమేహ రోగులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది.

కంటిచూపును మెరుగుపరుస్తాయి.

క్యాన్సర్ నివారణ..ఇందులో వుండే సల్పర్ మరియు ఫ్లేవనోయిడ్స్ కాన్సర్ రాకుండా చేస్తాయి. క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే యాంటీ ఏజెంట్స్ ని ఉత్పత్తి చేస్తాయి.