అందంగా కనబడాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మనం చర్మం రంగు మారుతుంది. దీంతో మహిళలు అనేక డబ్బులు ఖర్చు చేసి వివిధ రకాల అంటిమెంట్స్ వాడుతుంటారు. కానీ వాటిని వాడడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వాటికి బదులుగా కొన్ని రకాల ఫేస్ ఫ్యాక్ లను వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..
ఈ ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకోవడానికి గాను మనం ఆస్ప్రిన్ టాబ్లెట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆస్ప్రిన్ టాబ్లెట్ జ్వరాన్ని, నొప్పులను నివారించడంలోనే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఆస్ప్రిన్ టాబ్లెట్ ను ముందుగా పొడిగా చేయాలి. తరువాత దీనికి తగినంత నీళ్లను, టీ ట్రీ ఆయిల్ ను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
దీన్ని రాసుకునేటప్పుడు కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. ముఖానికి రాసుకున్న ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఆస్ప్రిన్ టాబ్లెట్ ను ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలతో వాటి వల్ల కలిగే మచ్చలను కూడా తొలగించుకోవచ్చు.