జుట్టు రాలకుండా, వత్తుగా పెరగాలంటే ఇలా చేయండి..

0
106

జుట్టు పొడవుగా పెరగాలని అందరు కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు జుట్టుపై ఆసక్తి పెట్టి అనేక చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చాలావరకు మంచి ఫలితాలు పొందని వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. వాస్తవానికి ఆడవాళ్ళ అందాన్ని జుట్టు చూసే పరిగణిస్తారు. మీరు కూడా అందంగా కనిపించాలంటే ఒక్కసారి ఈ చిట్కాలు ప్రయత్నించండి.

వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టుకు నూనె రాసుకోవడం, తలంటు చేయడం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా రోజుకు కనీసం 7-8 గంటల నిద్రపోవడం మంచిది. పాలకూర, బచ్చలికూర, క్యారెట్లు, బీన్స్ మొదలైనవి తినడం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది. అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వంటి డ్రై ఫ్రూప్ట్స్ తినడం మంచిది. గుడ్లు, చేపలు తినడం కుదా మంచిదే. అధిక నీరు తాగడం వల్ల జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.

గోరువెచ్చని నీటితో జుట్టు తలస్నానం చేయవద్దు. కలబంద ని గుజ్జును జుట్టుకురాసి గంట తర్వాత తలస్నానం చేయడంవల్ల కలబందలో ఉండే పోషకాలు జుట్టు పరిమాణాన్ని పెంచడానికి తోడ్పడతాయి. ఉల్లిపాయను మొక్కలుగా కోసి మిక్సీలో వేసి రసాన్ని తీసి జుట్టుకు మరియు కుదుళ్లకు రాసుకోవాలి. పదిహేను నిమిషాలు తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తూ ఉండాలి.