సాధారణంగా మనందరి శరీరంలో ఎముకలు ఉంటాయని తెలిసిన విషయమే. ఎముకలు బలంగా ఉండడం వల్ల మనం ఎంతటి కష్టమైనా పని అయినా అవలీలగా చేయగలుగుతాము. అందుకే ఎముకలను దృడంగా ఉంచుకోవడం కోసం కాల్షియం ఆధారిత ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాల్షియం ఆధారిత ఆహరం తీసుకోవడం వల్ల కేవలం ఎముకలు దృడంగా ఉండడమే కాకుండా ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా విరిగిపోయినా ఎముకలను అతికించడంలో కూడా కాల్షియం ఆధారిత ఆహరం ఉపయోగపడుతుంది. అందుకే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉండి శరీరాన్ని బలంగా మార్చుతుంది. ఉసిరి కేవలం శరీరానికి మేలు చేయడమే కాకుండా జుట్టు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకా ఎముకలను దృఢంగా ఉండాలంటే పాలు, పాలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.