మీ పిల్లలకు డబ్బా పాలు పడుతున్నారా? ఇవి తెలుసుకోండి

పాల డబ్బాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

0
94

కొందరు తల్లులకి పాలు రాకపోవడంతో పోతపాలు పడుతూ ఉంటారు. నెలల బిడ్డలకు పోతపాలు పడతారు ఈ సమయంలో పాల డబ్బాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి దగ్గర పాలు ఉంటే కచ్చితంగా ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పోతపాలు బిడ్డకు అంత మంచిది కాదు. పసిబిడ్డకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తుంటాయి.

పశువుల పాలుని బాటిల్ సహాయంతో ఇస్తారు. సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆవు, గేదె పాలు ఇవ్వవచ్చు. పాల బాటిల్ కనీసం 10.నిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం 2 నుంచి 4 నిమిషాల పాటు వేడి నీళ్లలో మరగనివ్వాలి. ఇక తల్లులు ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి.

ఇక పాలు తాగాడు కదా అని వెంటనే వారిని పడుకోబెడతారు ఇలా చేయవద్దు. ఒకవేళ ఆ పసిబిడ్డలు పడుకుంటే మనం భుజం పై వేసుకుని కాసేపు ఉంచుకోవాలి దీని వల్ల పిల్లలు పాలు కక్కరు. తేన్పు వచ్చే వరకు బిడ్డను తట్టాలి. పడుకున్న సమయంలో పాలు తాగించవద్దు. ఒకసారి తాగిన పాలను బిడ్డ స‌గం వదిలేస్తే మళ్లీ అదే పాలు ఇవ్వద్దు.