Immunity Boosting Foods | ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పెంచాలంటే కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. మునక్కాయ, ములగాకు పొడి తప్పనిసరిగా తినాలంటున్నారు. వీటిని తీసుకోవడంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Immunity Boosting Foods | వీటిలో పీచు అధికంగా ఉండడంవల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మునగలోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఎలర్జీలు దరిచేరకుండా ఉంటాయని సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంవల్ల శరీరాన్ని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అలసట, వడదెబ్బ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.