కరోనా వేళ పిల్లలకు ఈ ఫుడ్ పెట్టండి – ఇమ్యూనిటీ పెంచండి

immunity Food For Children's

0
100

ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలపై ఇది ప్రభావం చూపిస్తుందని జాగ్రత్తలు తెలియచేస్తున్నారు. ఇక భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.ఇక పిల్లలకు మంచి బలమైన ఆహారం పెట్టాలి. ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఆహారం పెట్టడం వల్ల, వారికి ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. మరి పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది చూద్దాం.

పిల్లల్లో జ్వరం, ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, గొంతునొప్పి, పెదాలు పగలడం, ముక్కు దిబ్బడ ఇలాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లండి. పిల్లలకు విటమిన్ డి చాలా అవసరం, ఉదయంపూట పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి.పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ డి ఉంటుంది. ఇవి ఆహారంలో అందేలా చూడండి.

ఇక పిల్లలకు ప్రతీ రోజూ ఉడకబెట్టిన గుడ్డు, అరటిపండు రెండు పూటలా మిల్క్ ఇవ్వండి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచాలి. తాజా పండ్లు ఇవ్వడం వల్ల వారికి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే డ్రైఫ్రూట్స్, నట్స్ ఇవ్వండి. దీని వల్ల ఎనర్జీ లెవల్స్ బాగుంటాయి. అరటి, బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు, నారింజ ఏదో ఓ పండు వారికి ఆహారంగా ఇవ్వండి.