శృంగార సామర్థ్యం పెరగాలా? అయితే ఇలా చేయండి..

Increase sexual potency? But do it like this ..

0
112

లైంగిక సామ‌ర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. శృంగార సామర్థ్యం తగ్గేందుకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీంతో పాటు ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం. మ‌రి శృంగార సామ‌ర్థ్యం పెర‌గాలంటే ఏ ఆహారం తింటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. డొపమైన్ వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి.

తీరిక లేని పని వల్ల అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే అమైనో ఆమ్లాలు గుడ్ల ద్వారా లభిస్తాయి. కాఫీలోని కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చేసి, రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.

సెక్స్ రెప్యుటేషన్‌‌లో ఆస్టర్లు చాలా ప్రభావం చూపుతాయి. జింక్ , విటమిన్‌ బి6 దీనిలో పుష్కలంగా లభిస్తాయి. టెస్టోస్టిరాన్‌‌కు ఈ రెండూ చాలా కీలకం. మిరప తినగానే ముఖం ఉబ్బుతుంది. అంటే రక్తనాళాలు విస్తరిస్తాయి. ముఖంలోని రక్తనాళాలే కాకుండా పురుషాంగానికి రక్తం సరఫరా మెరుగవుతుంది. ఉల్లి, వెల్లుల్లిలోని ఫైటోకెమికల్ ఎల్లిసిన్‌ రక్తాన్ని గడ్డకట్టుకుండా చేసి, ప్రసరణను పెంచుతుంది. వీటి వల్ల క్లాట్, క్లాగ్‌లు తగ్గిపోతాయి.