ఇండియా కరోనా అప్డేట్..హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
104

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో కూడా నిన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు నేడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,594 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య  4,32,36,695గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 50,548కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 195.35 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,32,36,695

మొత్తం మరణాలు: 5,24,771

యాక్టివ్​ కేసులు: 50,548

 రికవరీ రేటు: 98.76 శాతం