ఇండియా కరోనా అప్డేట్..హెల్త్ బులెటిన్ రిలీజ్..తాజా కేసులు ఎన్నంటే?

0
96

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.

గడిచిన 24 గంటల్లో 14,917 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 53 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,27,098కు చేరింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,11,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,42, 55678

యాక్టివ్ కేసులు: 1,11,252

మొత్తం మరణాలు: 5,27,098

కోలుకున్నవారు: 4,36,38844